Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకే ప్యాకేజ్ లో అన్నీ ఉంటాయి: దిల్ రాజు

  • మరో రెండు రోజుల్లో విడుదల కానున్న 'కృష్ణార్జున యుద్ధం'
  • తానే రిలీజ్ చేస్తున్నానని చెప్పిన దిల్ రాజు
  • కామెడీ, మ్యూజిక్, రొమాన్స్ అన్నీ ఉంటాయని వెల్లడి
తాను నిర్మించే చిత్రాల్లో క్యారెక్టర్స్, కామెడీ, మ్యూజిక్, రొమాన్స్... ఇలా అన్ని అంశాలూ ఇమిడి ఉంటాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యానించారు. నాని  హీరోగా తెరకెక్కించిన 'కృష్ణార్జున యుద్ధం' మరో రెండు రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించగా, దిల్ రాజు మాట్లాడారు. ఈ చిత్రాన్ని తానే రిలీజ్ చేస్తున్నానని చెప్పిన ఆయన, తానిచ్చే ప్యాకేజీలో ప్రతి ఒక్కరికీ కావాల్సిన అంశాలు ఉంటాయని చెప్పారు.

మేర్లపాక గాంధీ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' కథను తొలుత తనకే చెప్పాడని, సింపుల్ కథతో అది సూపర్ హిట్ గా నిలిచిందని గుర్తు చేశారు. 'కృష్ణార్జున యుద్ధం' నాన్ స్టాప్ ఎంటర్ టెయిన్ మెంట్ గా ఉంటుందని చెప్పారు. ఇక నాని మాట్లాడుతూ, సినిమా విజయంపై ఎంతో నమ్మకంతో ఉన్నామని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని చెప్పాడు.
Nani
Dil Raju
Krishnarjuna Yuddham

More Telugu News